కొమురంభీం: దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి: అదనపు కలెక్టర్

నిరుద్యోగ యువత అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని కొమురంభీం జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. శుక్రవారం వాంకిడి ఎంపీడీఓ ఆఫీస్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవాకేంద్రాన్ని ఆయన సందర్శించారు. రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్