దబోలిలో ప్రభుత్వ పథకాలపై కళాప్రదర్శన

జైనూర్ మండలం దబోలి గ్రామంలో శనివారం జరిగిన ఇందిరా మహిళా శక్తి ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ పథకాలపై కళాప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు ఆటపాటల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం,  వడ్డీ లేని రుణాలు, మహిళలకు ఇన్సూరెన్స్ వంటి పథకాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, కళాకారులు బాపు, మోహన్ నాయక్, శిరీష పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్