డిగ్రీ కోర్సులకు దోస్త్ రిజిస్ట్రేషన్ గడువు జూలై 31తో ముగుస్తున్నా, కొమురం భీం జిల్లా మారుమూల గ్రామాల్లోని విద్యార్థులు వర్షాల కారణంగా ఇప్పటికీ నమోదు చేసుకోలేకపోయారు. వానలతో రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో జిల్లా కేంద్రానికి రాలేని పరిస్థితి. కావున రిజిస్ట్రేషన్ గడువును మరో వారం పొడిగించాలని పిడిఎస్యు జిల్లా కార్యదర్శి జగజంపుల తిరుపతి డిమాండ్ చేశారు.