ఆసిఫాబాద్: షూటింగ్ లో బంగారు పతకం

తెలంగాణ స్టేట్ షూటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన 12వ రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీల్లో ఆసిఫాబాద్ కు చెందిన అభిజిత్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఓపెన్ సైట్ సీనియర్ ఈవెంట్ విభాగంలో బంగారు పతకం సాధించాడు. ఆసిఫాబాద్ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న అభిజిత్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ పోటీలు శుక్రవారం ముగిశాయి.

సంబంధిత పోస్ట్