ఆసిఫాబాద్: 'అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు'

అర్హులైన ప్రతి ఒక్కరికి విడతల వారీగా అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాదవ్ లోకేందర్ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని ఖిమానాయక్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఆత్రం అనిల్ కుమార్, చూహన్, సునీల్ కుమార్, మాజీ సర్పంచ్ పద్మావత్ చిరంజీవి గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్