పోశమ్మ బోనాల ఉత్సవాలలో పాల్గొన్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే

రెబ్బన మండలం వాంకుల గ్రామ మహిళలు కాగజ్ నగర్ పెద్దవాగు శ్రీ శ్రీ శ్రీ గాంధారి మైసమ్మ దేవాలయంలో ఆదివారం జరిగిన పోశమ్మ బోనాల ఉత్సవాలకు‌ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరయ్యారు. డోలు వాయిద్యాలతో మహిళలు నృత్యాలు చేసి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బోనం ఎత్తుకుని పూజారుల పూర్ణకుంభ స్వాగతం తర్వాత అమ్మవారికి మొక్కులు సమర్పించారు. వర్షాన్ని పట్టించుకోకుండా మహిళలతో కలిసి బోనం సమర్పించడం విశేషం.

సంబంధిత పోస్ట్