ఆసిఫాబాద్ మండల స్థాయి వాలీబాల్ ఫైనల్లో రవిచంద్రకాలని జట్టు విజేతగా, పాడిబండ జట్టు రన్నరప్‌గా నిలిచాయి. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి మొత్తం 14 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు సోమవారం అసిఫాబాద్ సీఐ రవీందర్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సతీష్ కూడా పాల్గొన్నారు.