ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలిగా ఆత్రం సుగుణక్క నియామకం

హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షురాలిగా ఆత్రం సుగుణక్క నియామక పత్రం అందుకున్నారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమెకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ పార్టీ నాయకత్వం నాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు తెలిపి, కాంగ్రెస్ బలోపేతం కోసం జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో పనిచేస్తానని, రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్