బాల్యవివాహాలపై అవగాహన – శాంతియుతంగా ఉత్సవాలు నిర్వహించాలి

తిర్యాణి మండలం నాయక్‌పుగూడలో మంగళవారం ఎస్ఐ సుబ్బారావు బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు. ఆడపిల్లలకు 18, మగపిల్లలకు 21 ఏళ్లు పూర్తైన తర్వాతే వివాహం చేయాలని, లేకపోతే అది చట్టరీత్యా నేరమని తెలిపారు. బాల్యవివాహాల వల్ల ఆరోగ్యం, విద్య దెబ్బతింటాయని పేర్కొన్నారు. అలాగే పెద్దయ్య ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని, మద్యం సేవనం, గొడవలు నివారించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్