దుబ్బగూడలో ప్లాస్టిక్ రహిత గ్రామం కోసం అవగాహన కార్యక్రమం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలం దుబ్బగూడ గ్రామంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అటవీ అధికారి శ్రీమతి సి. హెచ్. బాలమణి (IFS) నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణం, వన్యప్రాణులు, మానవ ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాలను వివరించారు. వస్త్ర సంచులు వంటి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచిస్తూ, గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్