జైనూర్‌లో పోష్ చట్టంపై అవగాహన కార్యక్రమం

కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నివారణ చట్టం (పోష్ చట్టం)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, ఎంపీడీఓ, ఆరోగ్య, పంచాయతీరాజ్, మహిళా-శిశు సంక్షేమ, డీఆర్డీఏ శాఖల మహిళా సిబ్బంది పాల్గొన్నారు. చట్టపరమైన నిబంధనలు, ఫిర్యాదు విధానం, మహిళల హక్కులపై వారికి వివరంగా అవగాహన కల్పించారు. మహిళల భద్రత, గౌరవ పరిరక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్