కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని వాంకిడి మండల కేంద్రంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నులే మేంగాజీ ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం గోయగాం గ్రామపంచాయతీలో మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మేంగాజీ, స్థానిక సర్పంచ్ కలిసి భూమిపూజ చేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.