కొమరం భీమ్ జిల్లా రెబ్బెన మండలంలో జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, బీజేపీ ఆత్మనిర్భర్ భారత్ జిల్లా కన్వీనర్ కేసరి ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల హామీలైన మహాలక్ష్మి పథకం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, రైతు రుణమాఫీ, వడ్ల కొనుగోలు, పెన్షన్ పెంపు, బీసీలకు 42% రిజర్వేషన్ తదితర అంశాలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హామీలు అమలు చేసిన తర్వాతే సీఎం రెబ్బెన గడ్డపై అడుగుపెట్టాలని, ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.