ఆదిలాబాద్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన ఎంపీ గోడం నగేశ్ కు బీజేపీ నాయకులు, అభిమానులు ఆదివారం ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాన వీధుల వెంట విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అభిమానులు బాణాసంచా కాలుస్తూ రోడ్ షో నిర్వహించారు. అభిమానులు, నాయకులు ఆయనకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.