తిర్యాణి మండలం చెలిమెలవాగు ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతైన లింగిగూడ ఉపసర్పంచ్ కవిత భర్త దినేశ్ (26) మృతదేహం శుక్రవారం లభ్యమైంది. పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మే 26న వివాహమైన దినేశ్ అప్పటినుంచి అత్తగారింట్లోనే ఉంటున్నాడు.