ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమం నిర్వహించాలని తిర్యాణి మండలంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ పూజారి అజయ్ అన్నారు. సోమవారం పూజారి మాట్లాడుతూ.. ఈ నెల 20వ తేదీన మండలంలో కొలువైన శ్రీరేణుక ఎల్లమ్మ బోనాలు నిర్వహిస్తామని అన్నారు. ఉదయం అమ్మవారికి అభిషేకం అనంతరం బోనం సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించాలని కోరారు.