కుమ్రం భీం జిల్లాలో బాక్సింగ్ లీగ్ 2025-26 ఘన ప్రారంభం

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం బాక్సింగ్ లీగ్ 2025-26 పోటీలు క్రీడా ఉత్సాహంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఖేలో ఇండియా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ హరిత, జిల్లా యువజన క్రీడా అధికారి అష్ఫాగ్ అహ్మద్ మార్గదర్శకత్వంలో ముత్తూట్ బాక్సింగ్ అకాడమీ వేదికగా ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి మహిళా క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వేముర్ల మధు, సెక్రటరీ మదురై శేఖర్, ఆర్మీ శివ నాయర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్