అక్టోబర్ 26న చలో హైదరాబాద్‌కు తరలి రావాలి.. సిఐటియు

కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ. 10,000 జీతాన్ని అమలు చేయాలని, ప్రైవేటీకరణను ఆపాలని, లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని కోరుతూ అక్టోబర్ 26న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా జాయింట్ సెక్రెటరీ వెలిశాల క్రిష్ణమాచారి తెలిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ కార్యక్రమం జరుగుతుందని, పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕