ధర్మం, న్యాయం, స్వరాజ్యం కోసం పోరాడిన ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి, జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ఎన్సిబీసి జాతీయ చైర్మన్ హంసరాజ్ అహీర్‌కు ఆదివారం అరె సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కోలే బిక్కాజి వినతిపత్రం అందజేశారు. శివాజీ మహరాజ్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని, అన్ని వర్గాలకు సమాన న్యాయం అందించిన మహానాయకుడిగా ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని బిక్కాజి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.