ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూ మండలం రాఘపూర్ గ్రామంలో స్వచ్ఛతా హీ సేవా - 2026 కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ ఆత్రం విజయలక్ష్మి భీంరావ్ ఆధ్వర్యంలో మంగళవారం పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అశోక్, కార్బారి చిక్రం రాజు, మహిళలు, చిన్నారులు పాల్గొని గ్రామ పరిసరాలను శుభ్రం చేస్తూ స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. స్వచ్ఛ భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సర్పంచ్ కోరారు.