జూన్ 1న సీఎం పర్యటనను విజయవంతం చేయాలి: ఆత్రం సుగుణ

జూన్ 1న కుమురంభీం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీల కోసం నిర్మించిన 28 ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత మంజూరు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే వేదికగా ఈ పర్యటన నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్