జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం రాజంపేట అంగన్‌వాడీ కేంద్రంలో ఆదివారం జిల్లా కలెక్టర్ హరిత చిన్నారికి పోలియో చుక్కలు వేయించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో పల్స్ పోలియో కార్యక్రమం కీలకమని పేర్కొంటూ, అర్హులైన ప్రతి చిన్నారికి చుక్కలు వేయించేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్