అనుమతులు లేకుండా ఫంక్షన్ హాల్ నిర్వహణపై ఫిర్యాదు

వాంకిడి మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన నిర్వహిస్తున్న ప్రహ్లాద్ ముండే ఫంక్షన్ హాల్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు అందింది. పంచాయతీ, డీటీపీసీ అనుమతులు లేకుండానే ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారని ఫిర్యాదు దారు ఆరోపించారు. గతంలో గ్రామ పంచాయతీ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అనుమతులు లేని నిర్మాణానికి విద్యుత్ మీటర్ కనెక్షన్ ఎలా ఇచ్చారనే అంశంపైనా విచారణ జరపాలని కోరారు. సంబంధిత అనుమతులు, విద్యుత్ కనెక్షన్ వివరాలను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕