కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ యువ నాయకుడు, లబాన్ సంఘం రాష్ట్ర నాయకుడు తిత్రే గోవింద్ కలిశారు. మధుర సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మధుర సమాజ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని సీఎం సానుకూలంగా స్పందించారని గోవింద్ తెలిపారు. సమాజ హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.