ట్రైబల్ స్పోర్ట్స్ పాఠశాలలో సైబర్ సెక్యూరిటీ అవగాహన

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ పాఠశాలలో బుధవారం సైబర్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా సంక్షేమ అధికారి డా. భాస్కర్, సోషల్ మీడియా వాడకంలో అప్రమత్తత, సైబర్ మోసాలపై జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు సూచించారు. డీసీపీఓ మహేష్, చదువుపై దృష్టి పెట్టాలని, అనుమానాస్పద లింకులు, ఫిషింగ్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని, 1930 హెల్ప్‌లైన్ వినియోగం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్