ఆశ్రమ పాఠశాలలో ఘనంగా దండారి గుస్సాడి వేడుకలు

ఆసిఫాబాద్‌ జిల్లా జనజాతి గౌరవ దివస్ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాలలో నాలుగో రోజు దండారి గుస్సాడి సాంస్కృతిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. గుస్సాడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని, విద్యార్థులు కొమురం భీమ్, బిర్సా ముండా వంటి గిరిజన వీరుల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని అంబాజీ సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕