ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు, ప్రకృతి ఆరాధన వారి జీవన విధానానికి ప్రతిబింబమని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క అన్నారు. బుధవారం లింగాపూర్ మండలం జాముల్‌ధార గ్రామపంచాయతీ పరిధిలోని కన్నెపల్లి పొచమ్మ తల్లి (మోతిగూడ అవ్వల్) దేవస్థానంలో నిర్వహించిన సంప్రదాయ విత్తనాల పండుగ పూజల్లో ఆమె పాల్గొన్నారు. ఆదివాసీ పెద్దలు, మహిళలు, యువకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామాల్లో సుఖశాంతులు నెలకొనాలని ప్రార్థించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.