కేరామేరి మండలంలోని పట్నాపూర్ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను శనివారం డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ సందర్శించారు. తరగతి గదులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, బోధనా పద్ధతులు, పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకునేందుకు ప్రశ్నలు అడిగి, స్వయంగా ఉపాధ్యాయుడిగా మారి పాఠాలు బోధించారు. ప్రాథమిక స్థాయిలో బలమైన విద్యా పునాది కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.