ఆసిఫాబాద్ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని మండలాల తహసీల్దార్లు, సూపర్‌వైజర్లతో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి వివరాలతో నింపి, సంతకంతో సహా బూత్ స్థాయి అధికారులు సేకరించి బీఎల్‌ఓ యాప్‌లో వెంటనే డిజిటలైజ్ చేయాలని కలెక్టర్ తెలిపారు.