వేసవిలో అంబలి పంపిణీ – దేవార వినోద్ స్వామి సేవలకు ప్రశంసలు

రెబ్బెన మండల కేంద్రంలోని ఇందిరానగర్ గ్రామంలో దేవార వినోద్ స్వామి ఆధ్వర్యంలో గత 48 రోజులుగా నిరంతరాయంగా అంబలి పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మండుతున్న వేసవిలో ప్రజలకు ఉపశమనం కలిగించే ఈ సేవా కార్యక్రమం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ప్రతిరోజూ సుమారు 1000 నుంచి 1500 మంది వరకు కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, ప్రయాణికులు, గ్రామస్తులు అంబలిని సేవిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో శ్రమించే వారికి ఈ అంబలి చల్లదనంతో పాటు ఉత్సాహాన్ని అందిస్తోంది. "సేవే పరమో ధర్మః" అనే భావంతో దేవార వినోద్ స్వామి, వారి కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్