కుమురం భీం జిల్లా కేంద్రంలో డీవైఎఫ్ఐ 47వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గెడం టికానంద్ జెండా ఆవిష్కరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీని విస్మరించిందని నాయకులు విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చాలని, రాజీవ్ యువ వికాసం పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని, తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు.