ఆసిఫాబాద్ మండలంలోని బురుగుడ గ్రామపంచాయతీ పరిధిలో గాజులవడ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు, మురుగు నీరు రహదారి మీదే నిలిచిపోతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గ్రామస్థులు ప్రజాప్రతినిధులకు, అధికారులకు పలుమార్లు వినతులు చేసినా స్పందన లేదని వాపోతున్నారు. తక్షణమే డ్రైనేజీ నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.