కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండలంలోని మోడీ ఆశ్రమ పాఠశాలలో సోమవారం మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ పాల్గొని, "మాదకద్రవ్యాలు వ్యక్తిగత జీవితాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తాయి అని అన్నారు. డ్రగ్స్ గురించి సమాచారం ఉంటే 1908 లేదా 8712670551 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.