తిర్యాని మండలం దంతన్‌పల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గెడం టికానంద్ పరిశీలించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు కొనసాగించాలని, కూలీలకు త్రాగునీరు, నీడ, ప్రథమ చికిత్స సౌకర్యాలు కల్పించాలని, ప్రతి జాబ్ కార్డ్‌కు 200 పని దినాలు పెంచి, రోజుకు ₹800 కూలి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, పథకాన్ని పట్టణాలకు విస్తరించాలని, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా, రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు.