ఆసిఫాబాద్: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పలు కీలక మార్పులు చేసింది. పథకం పేరును 'వీబీజీ రామ్ జీ'గా మారుస్తూ, పనిదినాలను పెంచింది. సమయానికి వేతన చెల్లింపులు, ఆలస్యమైతే పరిహారం అందించేలా భరోసా కల్పించింది. కొత్త జాబ్ కార్డు జారీ ప్రక్రియను సులభతరం చేస్తూ, దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. పథకంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. ఆధార్ కార్డుతో నేరుగా క్షేత్ర సహాయకుడిని సంప్రదిస్తే ఈ-కేవైసీ పూర్తి చేసి, ఉన్నతాధికారుల పరిశీలన అనంతరం కార్డు జారీ చేస్తారు.