ఆసిఫాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి-జిల్లా ఎస్పీ

ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటి, సంరక్షించాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. సోమవారం కెరమెరి మండలం మోడి ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన పోలీస్ మిత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. అడవులు తగ్గిపోతుండటంతో వర్షాలు ఆలస్యమవుతున్నాయని, పర్యావరణ సమతుల్యతను ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్