గీత కార్మికుల ప్రమాద మరణాలకు ₹10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

గీత వృత్తిలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న కార్మికులు వరుస ప్రమాదాల్లో మృతి చెందడం ఆందోళనకరమని గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేసరి అంజనేయులు గౌడ్ అన్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామానికి చెందిన కొత్తపల్లి వెంకటేష్ గౌడ్ తాటి చెట్టు నుంచి పడి మృతి చెందిన ఘటనపై ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీ మేరకు గీత కార్మికుల ప్రమాద మరణాల ఎక్స్‌గ్రేషియాను ₹10 లక్షలకు పెంచాలని, ప్రమాద బీమా, ఆధునిక భద్రతా పరికరాలు, ఉచిత వైద్య సహాయం, సంక్షేమ నిధి, లైసెన్సుల పునరుద్ధరణ వంటి హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్