ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య త్యాగం మరువలేనిది

నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ, గంజాయి తరలిస్తున్న కారును అడ్డుకునే క్రమంలో దుండగుల దాడిలో గాయపడి, హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన సౌమ్య త్యాగాన్ని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు ఇరుకుల్ల ఆంజనేయులు కొనియాడారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సంఘం నాయకులతో కలిసి సౌమ్యకు నివాళులర్పించారు. మత్తు పదార్థాల సరఫరాపై కఠిన చర్యలు తీసుకోవాలని, సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్