వాంకిడి వారపు సంతలో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రైతు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బోట్పెళ్లి జైరామ్, వాంకిడి మండలంలోని వారపు సంతలో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సుమారు రూ. 9 లక్షలకు పైగా సంత వేలం జరిగినప్పటికీ, రైతులకు తాగునీరు, మరుగుదొడ్లు, శాశ్వత షెడ్లు, డ్రైనేజీ, పార్కింగ్, విద్యుత్ దీపాలు వంటి మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. అధికారులు, గుత్తేదారులు నిర్లక్ష్యం వీడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్