కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఆసిఫాబాద్, కాగజ్ నగర్, తిర్యాణి, రెబ్బెన మండలాల్లోని 108 పంచాయతీలు, 938 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఆసిఫాబాద్ సర్పంచ్ స్థానానికి 27, వార్డులకు 236; కాగజ్ నగర్ సర్పంచ్ స్థానానికి 28, వార్డులకు 266; రెబ్బెన సర్పంచ్ స్థానానికి 24, వార్డులకు 214; తిర్యాని సర్పంచ్ స్థానానికి 29, వార్డులకు 222 నామినేషన్లు స్వీకరించనున్నారు.