ఆసిఫాబాద్: ఫ్లెక్సీ వివాదం.. కాంగ్రెస్ సమావేశంలో కలకలం

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఫ్లెక్సీలపై వివాదం చెలరేగింది. ఈ సమావేశంలో నియోజకవర్గంలో కొనసాగుతున్న రెండు వర్గాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ముఖ్యంగా, ఇన్చార్జి శ్యాం నాయక్ ఫొటోను బ్యానర్ లో పెట్టకపోవడంపై ఆయన వర్గానికి చెందిన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో సమావేశంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత పోస్ట్