వన్యప్రాణుల ఆవాసాల పునరుద్ధరణకు అటవీశాఖ చర్యలు

కొమరంభీం జిల్లా, సిర్పూర్, ఆసిఫాబాద్‌లో మనుషులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణ పెరుగుతున్న నేపథ్యంలో అటవీశాఖ చర్యలు చేపడుతోంది. జంతువుల ఆవాసాలు ధ్వంసం కావడం, పోడు వ్యవసాయం వల్ల వన్యప్రాణులు ఆవాసం కోల్పోయి బయటకు వస్తున్నాయని కాఘజ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్ అధికారి డా. అప్పయ్య తెలిపారు. ఈ సంఘర్షణను తగ్గించేందుకు కోల్పోయిన అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఆదివారం సిర్పూర్ రేంజ్‌లోని దుబ్బగూడ ప్లాంటేషన్‌ను సందర్శించిన సందర్భంగా, గతంలో పులి దాడిలో గాయపడ్డ రౌతు సురేష్ చేతుల మీదుగా మొక్కలు నాటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్