రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో వసుధ స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా అదనపు ఎస్పీ చిత్తరంజన్ శనివారం ప్రారంభించారు. ఈ శిక్షణ ద్వారా మహిళలు టైలరింగ్ నైపుణ్యాలు నేర్చుకుని ఆర్థికంగా స్వావలంబులు కావాలని, వారి ఆత్మగౌరవం పెరగాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉమా, అచ్చేశ్వర్రావు, సొల్లు లక్ష్మీ, ఎస్‌ఐ చంద్రశేఖర్, శిక్షణ పొందనున్న మహిళలు, పాల్గొన్నారు.