గంగాపూర్ వెంకటేశ్వర స్వామి దర్శనం: ఎమ్మెల్యే డా. పాల్వాయి

రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలోని ప్రాచీన వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రులతో మాట్లాడి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి, సర్పంచ్ వెంకటేష్, కొండ్ర మనోహర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేను ఆలయ అధికారులు శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్