భర్త మరణించి ఆరు సంవత్సరాలు గడిచినా పెన్షన్ మంజూరు కాకపోవడంతో, ముగ్గురు పిల్లల పోషణ భారంతో దుర్భర జీవితం గడుపుతున్నానని అడ్డెసర గ్రామానికి చెందిన కాస్లే రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇల్లు లేకపోయినా ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతరులకు కేటాయించారని, గత పదేళ్లుగా రేకుల షెడ్డులోనే నివసిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల గాలి దుమారానికి ఇంటిపై ఉన్న రేకులు ఎగిరిపోవడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.