జైనూర్ మండలం రాసిమెట్ట గ్రామనికి చెందిన జాతీయ ఆదివాసి గోండు చిత్రకళాకారుడు మడావి రాజేశ్వర్ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్ గోండ్ ఆర్ట్ రూపకర్తగా, ఆదివాసి ముద్దుబిడ్డగా పేరుగాంచిన రాజేశ్వర్ మంత్రికి గోండు చిత్రకళ విశిష్టతను వివరించారు.