ఆసిఫాబాద్: కులాంతరం వివాహాలకు ప్రభుత్వం అండ

తెలంగాణలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ అన్నారు. సోమవారం కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ కలెక్టరేట్లో కులాంతర వివాహం చేసుకున్న 8 జంటలకు రూ. 20 లక్షల ఆర్థికసాయం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలసి అందజేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జంటకి రూ. 2. 5 లక్షలు ప్రభుత్వం చేయూతనిస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్