కొమురం భీం స్ఫూర్తి గ్రామోత్సవం రౌటసంకెపల్లిలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఆదివాసీ భాష, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం ఆయన గ్రామస్తులకు సోలార్ ప్యానెళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్‌తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.