కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ఓపెన్ చేయాలని ఉద్దేశంతో శనివారం జిల్లాకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ విచ్చేశారు. ఆయనను జిల్లా జడ్జి ఎంవీ రమేష్, జిల్లా సబ్ జడ్జి యువరాజా, ఆసిఫాబాద్ మెజిస్ట్రేట్ జక్కుల అనంతలక్ష్మి, సిర్పూర్ మెజిస్ట్రేట్ అజయ్ కుమార్ లు శాలువతో సన్మానించి ఆహ్వానించారు. బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.