ఆసిఫాబాద్ జిల్లా లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. కాగజ్ నగర్ మండలం ఎన్జీవోస్ కాలనీలో ఇండ్ల నిర్మాణాన్ని సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి ఆయన పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణ దశలను నమోదు చేసి, బిల్లులు మంజూరు చేయాలని సూచించారు.